కోహ్లీ, అనుష్కల దీపావళి సంబరాలు.. ఫొటోలకు పోజులు!

  • ప్రస్తుతం విశ్రాంతి తీసుకుంటున్న కోహ్లీ
  • అనుష్కతో కలిసి దీపావళి సంబరాలు
  • సోషల్ మీడియాలో ఫోటోలు వైరల్
ఇండియన్ క్రికెట్ కెప్టెన్ విరాట్ కోహ్లీ, ఆయన భార్య అనుష్క శర్మలు ఈ సంవత్సరం దీపావళి పండగను ఘనంగా జరుపుకున్నారు. మరో వారంలో బంగ్లాదేశ్ తో టీ-20 సిరీస్ ఉన్న నేపథ్యంలో ప్రస్తుతం కుటుంబీకులతో కలిసి విశ్రాంతి తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్న కోహ్లీ, ఆదివారం ఫుల్ హంగామా చేశాడు.

 తమ ఇంటిని పూలు, దీపాలతో అందంగా ముస్తాబు చేశాడు. అనుష్కతో కలిసి ఫోటోలకు పోజులిచ్చాడు. ఆపై వాటిని తన సోషల్ మీడియా ఖాతాలో పోస్ట్ చేయగా, 'మేడ్ ఫర్ ఈచ్ అదర్' జంట అంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తున్నారు. "మీకూ మీ కుటుంబానికీ మా దీపావళి శుభాకాంక్షలు" అంటూ కోహ్లీ ఓ కామెంట్ ను కూడా పెట్టాడు.
Go Back to Shorts
Virat Kohli
Anushka Sharma
Virushka
Dewali
Celebrations

More Telugu News